ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
BDK: ఆళ్లపల్లి మండలం ఆనంతోగు తిర్లాపురం గ్రామం నుంచి పాయం సూరయ్య ఆధ్వర్యంలో 70 కుటుంబాలు, రామానుజగూడెం, ఇప్పనపల్లి, తునికి బండ గ్రామాల నుంచి 80 కుటుంబాలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి మంగళవారం చేరారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పాయం అన్నారు.