రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
చిత్తూరు: నగరి తడుకుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. అతి వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు శంకరం సంతానంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.