వాలీబాల్‌లో స్టేషన్ తిమ్మాపూర్ క్రీడాకారుల గెలుపు

వాలీబాల్‌లో స్టేషన్ తిమ్మాపూర్ క్రీడాకారుల గెలుపు

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాలీబాల్‌లో గెలుపొందిన స్టేషన్ తిమ్మాపూర్ క్రీడాకారులకు ఎంపీడీవో అరుంధతి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతోనే శారీరకంగా, మానసికంగా ఉల్లాసం కలుగుతుందని,యువత క్రీడల్లో మరింతగా రాణించాలన్నారు.