భారీ ఆర్థిక సహాయం అందజేత

భారీ ఆర్థిక సహాయం అందజేత

MNCL: దండేపల్లి మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రంగు సామ్రాట్ కుటుంబ సభ్యులకు తోటి స్నేహితులు రూ. 6,61,203 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సామ్రాట్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన మిత్రుడు శీను నాయక్, తెలంగాణ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ విరాళాన్ని సేకరించి సామ్రాట్ భార్య శైలజకు బుధవారం అందించారు.