ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఫిర్యాదులకు కొత్త నంబర్
నెల్లూరులో ప్రైవేట్ బస్సుల అక్రమాలు, అధిక ఛార్జీలపై రవాణాశాఖ సీరియస్ అయింది. నిబంధనలు మీరితే కఠిన చర్యలేనని DTC చందర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికుల రక్షణ కోసం 92816 07058 నంబర్ తెచ్చారు. ప్రయాణంలో ఏ సమస్య వచ్చినా, టికెట్ ధరలు పెంచినా ఫోన్ లేదా వాట్సాప్ చేయాలని అధికారులు తెలిపారు.