కమర్షియల్ గ్యాస్ కొరత.. హోటళ్లకు భారీ ఇబ్బందులు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. డీలర్లు స్టాక్ లేదని చెప్పడంతో హోటళ్లు, క్యాటరింగ్, కర్రీ పాయింట్ల నిర్వహణ కష్టమవుతోంది. పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడంతో సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఖర్చులు పెరిగి చివరకు ప్రభావం వినియోగదారులపై పడుతోంది.