వ్యవసాయ విద్యుత్ సరఫరాలో మార్పు
ELR: ఉంగుటూరు మండలం గొల్లగూడెం సబ్ స్టేషన్‌లో మరమత్తుల కారణంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాలు మార్చినట్లు ఏఈ వేణు తెలిపారు. నల్లమాడు, గొల్లగూడెం సబ్ స్టేషన్ పరిధిలో వ్యవసాయ ఫీడర్లకు సోమవారం ఉదయం 3 గంటల నుంచి 10 గంటల వరకు మధ్యాహ్నం 4గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. రైతులు గమనించాలని కోరారు.