VIDEO: ఆలయ పునఃప్రతిష్టాపనలో పాల్గొన్న లోకేష్

GNTR: దుగ్గిరాల మండలం కేఆర్ కొండూరులో ఆదివారం మహంకాళి ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేశ్, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.