గుడ్లూరులో నేడు పవర్ కట్

NLR: గుడ్లూరు మండల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మధుబాబు తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గుడ్లూరు గుల్లపాలెం, కొత్తపేట, బసిరెడ్డిపాలెం, చెంచిరెడ్డిపాలెం, మొగులూరులో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.