రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
KKD: అన్నవరంలో పెండ్యాల సతీశ్ కుమార్ ఇంటి దగ్గర నుంచి ములగపల్లి వీరబాబు ఇంటి వరకు నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి పనులను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.