ఫిర్యాదులపై సత్వర చర్యలు: ఎస్పీ

ఫిర్యాదులపై సత్వర చర్యలు: ఎస్పీ

SRPT: బాధితులకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను చట్టపరిధిలో వేగంగా పరిష్కరిస్తామని ఎస్పీ కే.నరసింహ భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.