బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత: వైఎస్ షర్మిల
కోనసీమ: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పట్ల దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ఏర్పడిందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమలాపురం మండలం బట్నవిల్లి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రాహుల్ ప్రధాని అయ్యాక పథకం పేరు మారుస్తామని పేర్కొన్నారు.