మాజీ మంత్రి జోగి అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే
NTR: మాజీ మంత్రి జోగి రమేష్‌పై నకిలీ మద్యం కేసు ఆపాదిస్తూ అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్ అని తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్ పరస శ్రీనివాసరావు ఆరోపించారు. జోగి అరెస్టుపై శ్రీనివాస్ స్పందిస్తూ విలేకరులతో మాట్లాడారు. కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాటలో మృతుల విషయాన్ని దారి మరల్చడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన ఉద్దేశం అన్నారు.