డిగ్రీ విద్యార్థులకు గమనిక
CTR: చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో మిగిలిన డిగ్రీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. జీవనజ్యోతి తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారని చెప్పారు. ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని ఆమె కోరారు. ఈనెల 24వ తేదీ లోపు స్పాట్ అడ్మిషన్లు పొందాలని సూచించారు.