మైదుకూరులో జీఎస్టీపై అవగాహన
KDP: మైదుకూరు ఎంపీడీవో ఆఫీసులో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన సదస్సు ఇన్చార్జ్ ఎంపీడీవో నాగేంద్రబాబు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, వైద్య పరికరాలపై జీఎస్టీని 12 నుంచి 5% శాతానికి తగ్గించారని తెలిపారు. జీఎస్టీ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సూచించారు. పన్ను తగ్గింపుతో మెడిసిన్ సామాన్యులకు మరింత అందుబాటులోకి వచ్చాయన్నారు.