హైవేలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టిన SP

VZM: రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్, హైవేలపై, ముఖ్య కూడళ్ళు వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధారణపై అవగాహణ కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. హెల్మెట్ ధరించడంతో ప్రమాదం జరిగినా తలకు తీవ్ర గాయం కాకుండా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చన్నారు.