‘రూ. లక్ష ఇచ్చినా వాళ్లు నాకు ఓటెయ్యరు’
ముస్లిం ఓటర్లపై అసోం సీఎం హిమంతా బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను రూ.10 వేలు కాదు.. రూ. లక్ష ఇచ్చినా ముస్లింలు నాకు ఓటు వేయరు' అని సీఎం వ్యాఖ్యానించారు. పథకాల కంటే భావజాలమే ముఖ్యమని, ఒక ముస్లిం వ్యక్తి తనకు కిడ్నీ ఇస్తానన్నాడు కానీ.. ఓటు మాత్రం వేయనని మొహం మీదే చెప్పాడని గుర్తుచేసుకున్నారు. కేవలం పథకాలు ఇస్తే ఓట్లు పడతాయనుకోవడం పొరపాటని ఆయన తేల్చిచెప్పారు.