పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ
ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను జేసీ పి. శ్రీనివాసులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరు, ఏర్పాట్లు, మొదలగు అంశాల గురించి అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ప్రశ్నపత్రం ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.