VIDEO: బైక్‌ను ఢీ కొన్న గేదె.. వ్యక్తికి తీవ్రగాయాలు

VIDEO: బైక్‌ను ఢీ కొన్న గేదె.. వ్యక్తికి తీవ్రగాయాలు

ASF: బెజ్జూరు మండలం మర్దిడి గ్రామ సమీపంలోని HP పెట్రోల్ పంప్ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణపల్లి సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య భర్త శ్రీనివాస్‌ను తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బైక్‌ను గేదె ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రుడుని వెంటనే స్థానిక కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.