గంటలోపు ఆసుపత్రికి చేరిస్తే రూ.25వేల రివార్డు: మంత్రి
HYD: నాగోల్ డ్రైవింగ్ సెంటర్‌లో 'అరైవ్- అలైవ్' కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రమాద బాధితులను గంటలోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడితే రూ. 25 వేల నగదుతో 'రహవీర్ అవార్డు' ఇస్తామని ప్రకటించారు.