హత్నూర బీజేపీ అధ్యక్షుడిగా నాగ ప్రభు గౌడ్

MDK: మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో హత్నూర మండల్ నూతన అధ్యక్షుడిగా నాగప్రభు గౌడ్‌కి నియామక పత్రం శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బిట్ల మహేష్, చంద్రం గౌడ్, రాజేష్, కుమార్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.