యువతకు ఉపాధి కల్పనే చంద్రన్న లక్ష్యం: ఎమ్మెల్యే
TPT: యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా చంద్రన్న ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు వర్చువల్ భూమిపూజ చేశారు. దీంతో రాష్ట్రంలో భారీ పరిశ్రమలు, పెట్టుబడులు రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, శాశ్వత అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.