'విద్యార్థుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలి'
KDP: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యా వెలుగును నింపాలని UTF రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మెగా DSCలో ఎంపికై పాఠశాలల్లో విధులు చేపట్టిన నూతన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా బుధవారం చక్రాయపేట మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేయాలన్నారు.