ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
సత్యసాయి: హిందూపురంలోని శ్రీ వ్యాస రాయ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా నూతనంగా నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారాముల కళ్యాణ మండపంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగ రంగ వైభవంగా జరిపారు. ఆలయ ధర్మకర్త రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీసులు ప్రజలందరిపై ఉంటాయన్నారు.