‘డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’
KNR: హుజురాబాద్ పట్టణ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. కౌన్సిలర్ గందె శ్రీనివాస్, సంఘ అధ్యక్షుడు సుద్దాల హరిశంకర్ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ పక్కన ప్రకృతి ఒడిలో ఉన్న అందమైన ప్రదేశాన్ని యార్డుగా మార్చడం సరికాదన్నారు.