నవీన్ యాదవ్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే జారే
BDK: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రహమత్ నగర్ 102 డివిజన్‌లో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రచారంలో ఇవాళ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా నాయకులు ప్రచారం కొనసాగిస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా నవీన్ యాదవ్‌కు ఘన విజయాన్ని ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.