బాధితుడి ఇంట్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు

బాధితుడి ఇంట్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు

MHBD: బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో గాయపడిన బాధితుడి ఇంటికే వెళ్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గురువారం మండల కేంద్రానికి చెందిన రాయల సతీష్ ఓ వివాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరగడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి బాధితుడి ఇంటికి వెళ్లి ఘటనపై విచారించి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.