కోటి సంతకాల సేకరణకు స్పందన: సజ్జల

కోటి సంతకాల సేకరణకు స్పందన: సజ్జల

AP: రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు స్పందన వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, అందుకే సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.