VIDEO: కాళేశ్వరంకు కొనసాగుతున్న వరద ఉధృతి

JHBL: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సోమవారం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పుష్కర ఘాట్‌ల వద్ద 11.330 మీటర్ల ఎత్తులో ఉభయ నదుల వరద ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 6,36,130 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 6,36,130 క్యూసెక్కులుగా ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.