VIDEO: జొన్నవాడలో ఆలయ భూములకు వేలంపాట కార్యక్రమం
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ ఆలయ భూములకు ఆలయం సమీపంలోని అతిథి గృహంలో సోమవారం వేలంపాటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి చెందిన పెనుబల్లి, జొన్నవాడ గ్రామాలలోని భూములతో పాటు, ఆలయానికి చెందిన ఉత్తరం వైపు దుకాణాలకు సంవత్సరం లీజు కాలపరిమితికి వేలంపాట చేపట్టారు.