విషాదం.. భవనంపై నుంచి పడి మృతి
SRD: జిల్లాలో ప్రమాదవశాత్తు పెయింటర్ మృతి చెందిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. సంగారెడ్డిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ భవనంలో పెయింటింగ్ పనులు చేస్తున్న జనార్దన్ నాయక్ భవనం నంచి కిండ పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.