ఎన్నికలను బహిష్కరించిన మల్లుపేట గ్రామస్థులు
KMR: సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామస్థులు సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలను బహిష్కరించారు. శనివారం గ్రామ సచివాలయం వద్ద గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థులు ఎవరూ పోటీ చేయకూడదని నిర్ణయించారు.