VIDEO: పెద్దపులి సంచారంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

ప్రకాశం: రాచర్ల ఫారం సమీపంలో పెద్దపులి సంచారంతో ఆందోళనగా ఉందని స్థానిక ప్రజలు శుక్రవారం తెలిపారు. నిన్నపెద్దపులి తిరుగుతున్నట్లుగా పాదముద్రలు గుర్తించి అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు పెద్దపల్లి సంచారంపై స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ పశువులను తీసుకొని ఒంటరిగా ఈ ప్రాంతంలోకి రావద్దని అధికారులు హెచ్చరించారు.