రికవరీ చేసిన ఫోన్ బాధితుడికి అందజేత

రికవరీ చేసిన ఫోన్ బాధితుడికి అందజేత

BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన లక్కకుల వెంకటేశ్వర్లు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు రికవరీ చేసి మంగళవారం బాధితుడికి అందజేశారు. ఈ నెల 17న బాధితుడు ఫిర్యాదు చేయగా, సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఫోన్‌ను ట్రేస్ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై ఖాదర్ బాషా చేతుల మీదుగా ఫోన్‌ను అందుకున్న వెంకటేశ్వర్లు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.