VIDEO: చిరుత సంచారంపై అటవీ అధికారుల పరిశీలన

VIDEO: చిరుత సంచారంపై అటవీ అధికారుల పరిశీలన

KMR: మద్నూర్ మండలం హండే కేలూర్ శివారులో చిరుత కనబడిందని రైతులు తెలుపడంతో అటవీ శాఖ అధికారులు ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. గ్రామ శివారు, మహారాష్ట్ర నాగరల్ గట్టు మధ్యలో ఓ రైతుకు చిరుత కనిపించిందని అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లారు. దీంతో మహారాష్ట్ర అధికారులతో కలిసి కొన్ని అడుగు ముద్రలు సేకరించారు.