'మే 1నుంచి స్వయం ఉపాధి ఉచిత శిక్షణ తరగతులు'
NZB: SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBI RESTI) ఆధ్వర్యంలో మే 1న ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఎలక్ట్రికల్ హౌసింగ్ వైర్, CC TV కెమెరా ఇన్స్టలేషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. NZB ప్రాంత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కొరకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.