ప్రజా ఫిర్యాదుల వేదికలో 30 ఫిర్యాదులు
AKP: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో ఈరోజు మొత్తం 30 ఫిర్యాదులు స్వీకరించామని అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఫిర్యాదిని సానుకూలంగా విని తక్షణమే విచారణ చేసి, చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామన్నారు.