"ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలి'

SRPT: ఐకేపీ కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని రాయనిగూడెం, టేకుమట్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. ధాన్యం 17 శాతం తేమ రాగానే వెంటనే కాంటాలు వేయాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు.