'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
ASR: స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డుంబ్రిగుడ ఎస్సై ఎల్.సురేష్ సూచించారు. బుధవారం నందివలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. బాలికలు, మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.