'ప్రమాదం జరగ ముందే చెట్లను తొలగించాలి'

వనపర్తి: పట్టణంలోని బ్రహ్మంగారి వీధిలో రోడ్లకు ఇరువైపున నాటిన చెట్లు విపరీతంగా పెరగి కరెంట్ తీగలకు చెట్లు ఆనుకోవడం ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాటిని తొలగించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి పరమేశ్వర చారి డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పరిశీలించి ఏఈ కి ఫోన్‌లో సమాచారం ఇవ్వగా వర్షం తగ్గాక తొలగిస్తామని ఏఈ తెలిపారు.