‘హిందీని రుద్దడానికి కొత్త ఎత్తుగడ?’
'ఒకే భాష, మూడు లిపులు' అనే ముసుగులో కేంద్ర ప్రభుత్వం హిందీని ప్రోత్సహిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. హిందీ పేర్లను తమిళం, ఇంగ్లీష్ లిపిల్లో రాయడం ద్వారా హిందీని పరోక్షంగా రుద్దుతున్నారని ఆయన మండిపడ్డారు. తమిళ భాషా అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని, ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్టాలిన్ స్పష్టం చేశారు.