ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం

AKP: నర్సీపట్నం ప్రజారవాణా సంస్థ (ఆర్టీసీ) నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు సోమవారం తమ సమస్యలపై ఆర్డిఓ రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి జిఎస్ నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగ భద్రత సర్క్యులర్‌ను అమలు చేయకుండా ఉద్యోగులను తొలగిస్తుందన్నారు. కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని, వైద్య సదుపాయం కల్పించడం లేదని ఆరోపించారు.