'1000 మందికి తక్కువ కాకుండా ఉపాధి పనులు'
VZM: ప్రతిరోజూ మండలంలో కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పనులను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. అలాగే పనుల పురరోగతిని తెలుసుకున్నారు.