ప్రమాదకరంగా మారిన పెద్ద కాలువ బ్రిడ్జి

GNTR: ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు వద్ద పెద్ద కాలువ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. కాలువపై రక్షణ గ్రిల్స్ తుప్పుపట్టి విరిగిపోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఒకే కుటుంబంలో ఏడుగురి ప్రాణాలు తీసిన ఈ కాలువ వద్ద అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.