వేలం వేస్తే ఎన్నిక చెల్లదు: కలెక్టర్

వేలం వేస్తే ఎన్నిక చెల్లదు: కలెక్టర్

BHNG: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం అక్రమం అని అలాంటి ఎన్నిక చెల్లదని, రుజువైతే ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై వేటు పడుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన భూదాన్ పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.