VIDEO: దండబాడులో కుండపోత వర్షం
ASR: అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ దండబాడు గ్రామంలో శుక్రవారం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. వడగాలతో కూడిన కుండపోత వర్షం కారణంగా గ్రామం ఒక్కసారిగా జలమయమైంది. కొద్దిసేపట్లోనే గ్రామంలోని ప్రధాన వీధులు, చిన్న రహదారులు నీటితో నిండిపోయాయి. వర్షం తీవ్రతకు కాల్వలు పొంగిపొర్లడంతో ఇళ్ల వద్దకు కూడా నీరు చేరినట్లు స్థానికులు తెలిపారు.