'పులివెందులకు స్వాతంత్య్ర వచ్చింది'

KDP: పులివెందులలో ZPTC ఉప ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిందని TDP MLA బాలకృష్ణ తెలిపారు. TDP అభ్యర్థి గెలుపుతో 40ఏళ్ల తర్వాత పులివెందులకు స్వాతంత్య్రం వచ్చిందని, ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని చెప్పారు. ఈ విజయం తమ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినందునే 11మంది నామినేషన్ వేశారన్నారు.