VIDEO: 'వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి'

JGL: జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్, వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలు, డీఎస్పీ రఘు చందర్ సూచనల మేరకు, మంగళవారం ఉదయం 11 గంటలకు దేవిశ్రీ గార్డెన్లో గణేశ మండప నిర్వాహకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు