పెంచలకోనలో ఎర్రచందనం దుంగలు.. స్మగ్లర్ అరెస్ట్

NLR: రాపూరు మండలం పెంచలకోన వద్ద నాలుగు ఎర్రచందనం దుంగలు, ఒక స్మగ్లర్‌ను తిరుపతి టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పెంచలకోన అటవీ ప్రాంతంలో కుంబింగ్ చేపడుతుండగా ఈదలచెరువు వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన నాలుగు ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.