అమ్మవారి దర్శనం ఈ రెండు రోజులు మాత్రమే

అమ్మవారి దర్శనం ఈ రెండు రోజులు మాత్రమే

CTR: కులమతాలకు అతీతంగా పుంగనూరు ప్రజలు దైవంగా భావించే 'సుగుటూరు గంగమ్మ' జాతర ఈ నెల 25, 26వ తేదీల్లో జరగనున్నట్లు జమీందారు వంశీకుల అర్చకులు బసవ స్వామి వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జమీందారుల ఆధ్వర్యంలో 525 సంవత్సరాలుగా జాతర జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే మొదటి చాటింపు పూర్తయిందని, శుక్రవారం రెండో చాటింపు ఉంటుందన్నారు.